![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -188 లో.. దుగ్గిరాల ఇంటి కోడలికి ఎంత స్వేచ్ఛ ఇచ్చారో మీ ఇంటి కోడలిని చూస్తే తెలుస్తుంది. ఇంత గొప్పింటి వాళ్ళైనా మాములు మనిషి లాగా వెళ్లి వాళ్ళ ఇంట్లో వర్క్ చేశారు. మీ ఇద్దరికీ సన్మానం చేద్దామని అనుకుంటున్నామని మీడియా వాళ్ళు.. కావ్య, రాజ్ లకి సన్మానం చేస్తారు.. ఈ ఫొటోస్ తో పెద్ద ఆర్టికల్ రాస్తామని మీడియా వాళ్ళు చెప్తారు.
ఆ తర్వాత ఇదంతా కావ్య వల్లే.. అప్పుడు కావ్య ఏదో తప్పు చేసిందని అందరూ అన్నారు కానీ ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుతున్నారు అని సీతరామయ్య అంటాడు. ఈ సందర్భంగా నీకేం కావాలో అడుగమని సీతరామయ్య అంటాడు. నాకేం వద్దు తాతగారు.. ఇంట్లో అందరూ నాతో మాట్లాడాలి. నన్ను కూడా ఈ ఇంటి మనిషిలా చూడాలని కావ్య చెప్తుంది. ప్రొద్దున చెప్పాను కదా అని సుభాష్ అంటాడు. దానికి అందరూ ఒప్పుకుంటారు. మీరు ఎంత మంది ఒప్పుకున్న నా దృష్టిలో ఎప్పుడు స్థానం ఇవ్వనని అపర్ణ కోపంగా చెప్పేసి లోపలికి వెళ్తుంది. మరొక వైపు స్వప్న తను ప్రెగ్నెంట్ కాదని అందరికి తెలిసిపోతుందని ఇంటికి వెళదామని అంటుంది. సరేనని రాహుల్, రుద్రాణి, స్వప్న బయల్దేరుతుండగా డాక్టర్ వచ్చారని నర్సు చెప్తాడు. స్వప్నని తీసుకొని రాహుల్, రుద్రాణి కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. స్వప్న లోపలికి వెళ్లేసరికి.. అక్కడి డాక్టర్ కి స్వప్న ప్రెగ్నెంట్ కాదని విషయం తెలుసు. ఇప్పుడు కూడా వాళ్లకి చెప్పకండని స్వప్న డాక్టర్ కి రిక్వెస్ట్ చేస్తుంది. మీ కడుపులో బేబీ ఆరోగ్యంగా ఉందని స్వప్నతో డాక్టర్ చెప్తుంది. ఇక అక్కడే ఉన్న రాహుల్ , రుద్రాణి డాక్టర్ తో మాట్లాడతారు. ఇప్పుడు నీకు మూడు నెలలు.. నీ కడుపు పెరుగకుంటే అందరికి డౌట్ వస్తుంది. అప్పుడు నేను మోసం చేసానని అనుకుంటారని డాక్టర్ అనగానే నేను చూసుకుంటానని స్వప్న చెప్తుంది.
మరొక వైపు కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి.. తనకి పెళ్లి కాలేదు, పైగా మిమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసింది నేనే అని చెప్పగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. నీకు ఒక గిఫ్ట్ పంపాను చుడండని అనామిక చెప్తుంది. కళ్యాణ్ , అనామిక పంపిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే.. అందులో కళ్యాణ్ పేరు మీద తన కవితల బుక్ ప్రింట్ అయి ఉంటుంది. అది చూసి కళ్యాణ్ ఇంకా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ పై కాఫీ షాప్ లో కలుద్దామని ఉండడంతో కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే వెళ్లి కలవాలని అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |